స్విగ్గితో ఇక్సిగో ట్రైన్స్ , కన్ఫర్మ్ టికెట్ ఒప్పందం
బెంగళూరు, ఏప్రిల్ 2026: భారతదేశంలో ప్రముఖ ఏఐ ఆధారిత ట్రైన్ టిక్కెటింగ్ ప్లాట్ ఫాం, ఇక్సిగో ట్రైన్స్ అండ్ కన్ఫర్మ్ టికెట్, ‘ఫుట్ ఆన్ ట్రైన్’ సేవలను మరింత వేగవంతం చేసే క్రమంలో భాగంగా స్విగ్గీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్విగ్గీ వారి రెస్టారెంట్ నెట్ వర్క్ ను ఇక్సిగో అండ్ కన్ఫర్మ్ టిక్కెట్ యాప్స్ లో చేర్చడం ద్వారా కస్టమర్లు ఆర్డర్ చేసినప్పుడు ప్రయాణంలో ప్రయాణికుల ఆకలి సమస్యకు పరిష్కారాన్ని చూపించనుంది.
ఈ ఒప్పందం ద్వారా, ప్రయాణికులు ప్రసిద్ధి చెందిన జాతీయ బ్రాండ్స్ నుండి నగరాల్లో బాగా తెలిసిన స్థానిక రుచుల వరకు విస్తృత శ్రేణి భోజనాల ఎంపికలను ట్రైన్ లో ప్రయాణిస్తుండగానే పొందొచ్చు. తాము ప్రయాణించే మార్గం వెంట ఉన్న ప్రాంతీయ ప్రత్యేకతలను ,పరిచయమున్న ఇష్టమైన భోజనాలను ఎంచుకోవచ్చు. తాము ప్రాధాన్యతనిచ్చిన బోజనాలను నిరంతరంగా ఆర్డర్ చేయడానికి మరియు తమ సీట్ల వద్దకు నేరుగా డెలివరీని పొందడానికి ప్రయాణికులకు వీలు కల్పించడం ద్వారా రైలు ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేయడానికి ఈ సేవలు రూపొందించబడ్డాయి.
ఈ భాగస్వామంతో రైలు ప్రయాణికులు భారతదేశంలోని 160 + రైల్వే స్టేషన్స్ లో 40,000 నమ్మకమైన రెస్టారెంట్ భాగస్వాముల నుండి ఎంపిక చేసిన మెనూలు బ్రౌజ్ చేయవచ్చు, తాజా మరియు పరిశుభ్రమైన భోజనాలను ఆర్డర్ చేయవచ్చు. రైలులో తమ సీట్ల వద్దకు నేరుగా డెలివరీ పొందవచ్చు. ప్రయాణికులు 4 రోజులు ముందు నుండి రైలు రావడానికి 30 నిముషాల ముందు వరకు కూడా భోజనాలు బుక్ చేయవచ్చు.
ఇంకా, రైలులో ఇచ్చే ఆహారం ఆర్డర్లపై స్విగ్గీ ‘డెలివరీ హామీ ఇస్తోంది లేదా పూర్తి డబ్బు వాపసు’ ఇచ్చే సౌకర్యం కూడా అందచేస్తోంది. ‘ఫుడ్ ఆన్ ట్రైన్’లో స్విగ్గీ రెస్టారెంట్ల జాబితాను చూడటానికి కస్టమర్లు తమ ఇక్సిగో లేదా కన్ఫర్మ్ టిక్కెట్ యాప్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ చేయడానికి, ప్రయాణికులు ఇక్సిగో ట్రైన్స్ లేదా కన్ఫర్మ్ టిక్కెట్ యాప్ లోని హోం పేజీపై ‘ఆర్డర్ ఫుడ్ ఆన్ ట్రైన్’ ఎంపికను ఎంచుకోవచ్చు, పీఎన్ఆర్ నంబర్ నమోదు చేయవచ్చు మరియు డెలివరీ స్టేషన్ ను ఎంచుకోవచ్చు.




