21 March, 2026 | 2:35 PM

ఉగాది వేడుకల్లో జబర్దస్త్ కళాకారులు

20-03-2026 12:00 AM

ఆటపాటలతో సందడి 

నిర్మల్, మార్చి 19 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉగాది ఉత్సవం ఆధ్వర్యంలో గురువారం పరాభవ నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ వేడుకలను జబర్దస్త్ కళాకారులు వినోద్ జబర్దస్త్ సుధాకర్ ప్రవీణ్, కెవ్వు కార్తీక్ పాల్గొని ఉగాది సంబరాల యొక్క ప్రాధాన్యతను తెలిపారు. విద్యార్థులతో ఆడి పాడి సందడి చేశారు.

పరాభవ సంవత్సరంలో ప్రజలు విజయం సా ధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ను అభినందించారు. నరసింహ మూర్తి పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్య క్షులు పొదిలి చిన్నయ్య, అధ్యక్షులు పొన్నం నారాయణ గౌడ్ కృష్ణంరాజు, కిరణ్ కుమార్ డాక్టర్ అవినాష్ చంద్రిక ఆమడ శ్రీధర్ తదితరులు ఉన్నారు.