13 June, 2026 | 12:17 PM

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

13-06-2026 11:29 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట వేంనరేందర్ రెడ్డి, రోహిణ్ రెడ్డి ఉన్నారు. నిన్న ఢిల్లీ నుంచి వస్తున్న సీఎం విమానాన్ని సిబ్బంది బెంగళూరుకు మళ్లించారు. ప్రతికూల వాతావరణం(Adverse weather conditions) వల్ల రేవంత్ రెడ్డి నిన్న బెంగళూరులోనే ఉండిపోయారు. 

గురువారం నాడు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగిన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో(Niti Aayog governing council meeting) పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీకి పయనం అయ్యారు. ఈ పర్యటనలో భాగంగా లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రధాని మోదీ, కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు

శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మియాపూర్, చందాపూర్, శేరిలింగంపల్లి, చింతల్, బాలానగర్, లక్డీకాపూల్, పంజాగుట్ట, బషీర్‌బాగ్, కోటి, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, మణికొండ తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తమై, పని ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.