6 May, 2026 | 1:35 PM

పీఏసిఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జాబోరే పెంటయ్య

06-05-2026 01:04 PM

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం వాంకిడి పీఏసీఎస్ చైర్మన్ గా  జాబోరే పెంటయ్య బుధవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు (DCO) జిల్లా కో-ఆపరేటివ్ పర్సనల్ ఇంచార్జ్ బి.మోహన్ గౌడ్ చేతుల మీదు గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జాబోరే పెంటయ్య మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామ న్నారు. ఈ సంద‌ర్భంగా వాంకిడి సర్పంచ్ చునర్కర్ సతీష్,పీఏసీఎస్ వైస్ చైర్మన్ నేపాజి, బంబార సర్పంచ్ బెండరే క్రిష్టాజీ, సారండీ మాజీ సర్పంచ్ దుర్గం కమలాకర్, డైరెక్టర్లు గొల్ల, దిగంబర్, చప్లే సీతారాం, సిఈఓ ఒమాజీ, సుధాకర్, మండల బీఆర్ఎస్ నాయకు లు మండల బీఆర్ఎస్ కార్య కర్తలు, పీఏసీఎస్ సిబ్బంది పీఏసీఎస్ చైర్మన్ జాబోరే పెంటయ్యకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాం క్షలు తెలిపారు.