ఎరువులు, విత్తనాల దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి
15-06-2026 12:06 AM
బెజ్జంకి, జూన్ 14: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యాప్తంగా ఉన్న ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవ సాయ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చే పట్టాలని AIYF మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ డిమాండ్ చేశారు. నకిలీ విత్త నాలు, నాణ్యతలేని ఎరువుల విక్రయాలను అరికట్టి రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ముందస్తు సమా చారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.






