2 August, 2026 | 3:05 PM

పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జాదవ్ బలి రామ్

02-08-2026 01:53 PM

బోథ్. ఆగస్టు 2 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించే కొట్టాల భోజనం బోనాల జాతర మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జాదవ్ బలి రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఆయన పాల్గొనడంతో కమిటీ వారు శాలువా కప్పి సన్మానించారు.