ప్రజలందరూ నా కుటుంబమే
జగ్గారెడ్డి కుటుంబం అంటే జగ్గారెడ్డి భార్య, కూతురు, కొడుకే కాదు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే
సంగారెడ్డిలోని గణపతి నిమజ్జన వేడుకల్లో జగ్గారెడ్డి వ్యాఖ్యలు
సంగారెడ్డి ప్రజల పక్షాన రూ 21 లక్షలకు చైతన్య యువజన సంఘం లడ్డూను వేలంలో దక్కించుకున్న జగ్గారెడ్డి
సంగారెడ్డి,(విజయ క్రాంతి): "జగ్గారెడ్డి కుటుంబం అంటే జగ్గారెడ్డి భార్య , జగ్గారెడ్డి కొడుకు, జగ్గారెడ్డి కూతురు, జగ్గారెడ్డి కుటుంబ సభ్యులే కాదు.. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ జగ్గారెడ్డి ఖాందానే" అంటూ శుక్రవారం జరిగిన గణపతి నిమర్జనం వేడుకల్లో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు ప్రస్తావించారు. సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన చైతన్య యువజన సంఘం వినాయక లడ్డూ వేలంలో ఆయన పాల్గొన్నారు. వేలం పాట లో రూ. 21 లక్షలకు లడ్డు ప్రసాదం దక్కించుకున్నారు. సంగారెడ్డి ప్రజలందరి తరపున ఈ వేలంపాట పాడానని పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా తన ఆధ్వర్యంలో పండుగలు జరుగుతాయని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రజలంతా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడం తనకు మరింత ఆనందాన్నిచ్చిందని వెల్లడించారు. దాని వేలం పాటలు పొందిన లడ్డును అక్కడికక్కడే అందరికీ తన కుటుంబ సభ్యుల ద్వారా పంచిపెట్టారు. కథ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు సంగారెడ్డి లో జరిగిన నిమజ్జన వేడుకలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. కింది బజార్ చెరువు వద్ద ఏర్పాటుచేసిన భారీ క్రేన్ల ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటే అక్కడి పరిస్థితిని సమీక్షించారు. విగ్రహాల ఊరేగింపులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా జగ్గారెడ్డి స్వయంగా ఆటోలో, కాలినడకన తిరుగుతూ తననైన శైలిలో ట్రాఫిక్ ను నియంత్రించారు.