27 March, 2026 | 2:37 PM

Breaking News

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్   •   భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ   •   నేపాల్‌ ప్రధానిగా బాలేంద్ర షా.. పగ్గాలు చేపట్టిన అతిపిన్న వయస్కుడు   •   శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •  

జగిత్యాల ‘జితేందర్‌రెడ్డి’

22-10-2024 12:00 AM

రాకేశ్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ.. 1980 కాలంలో జగిత్యాల చుట్టుపక్కల జరిగిన యధార్థ సంఘ టనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. కాలేజీ రోజుల నుంచే ప్రజా నాయకుడిగా నక్సలైట్లతో జితేందర్‌రెడ్డి చేసిన పోరాటం, ఆయన రాజకీయ జీవితాంశాలతో రూపొందిందీ చిత్రం.

ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలతోపాటు టీజర్, గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రోమోను విడుదల చేశారు. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో వైశాలిరాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాశ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వీఎస్ జ్ఞానశేఖర్; సంగీత దర్శకులు: గోపి సుందర్.