10 August, 2026 | 10:36 PM

తుంగతుర్తి పీఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులుగా పోతురాజు, బాణాల

10-08-2026 08:24 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల పీఆర్టీయు అధ్యక్షలుగా పోతురాజు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా బాణాల సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సూర్యాపేటలో పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ సమక్షంలో తుంగతుర్తి మండల శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేట్ అధ్యక్షులు మహమ్మద్ జమీల్ షరీఫ్, మహిళా అసోసియేట్ అధ్యక్షులు కొండ లక్మి, ఉపాధ్యక్షులు  చెంచల వెంకటరమణ, మహిళా ఉపాధ్యక్షులు  గుడుపూడి సుచిత, కార్యదర్శిలు  ధరావత్ సూర్యచంద్ర, బానోత్ రవి  మహిళా  కార్యదర్శిలు ఎన్నికైన మిర్యాల శ్రీదేవి, నిమ్మరబోయిన నవీనా ను ఎన్నుకున్నారు