10 August, 2026 | 9:15 PM

సెప్టెంబర్ 1న చలో ఢిల్లీని జయప్రదం చేయండి

10-08-2026 08:12 PM

దమ్మపేట,(విజయక్రాంతి): సిపిఐ పార్టీ జాతీయ, తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా ప్రజా చైతన్య యాత్రలు ఆగస్టు 6 నుండి 14వరకు జయప్రదం చేయాలని సీపీఐ పార్టీ నాయకులు కూకలకుంట సత్యనారాయణ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో కూకలకుంట సత్యనారాయణ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ పార్టీ మండల కార్యదర్శి సుంకిపాక ధర్మ మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న వున్న బీజేపీ పార్టీ దశాబ్ద కాలంలో ఎన్నికల సందర్భంగా అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తామని వాగ్దానం చేసి శూన్య హస్తం చూపిస్తుందన్నారు.

దేశంలో నేడు పెరుగుతున్న నిరుద్యోగం, విస్తరిస్తున్న అసమానతలు, బలహీనపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక ఉద్రిక్తలను ఎదుర్కొంటుందన్నారు. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం నుండి ఈ ప్రశ్నలకు సమాధానం కావాలని కోరినప్పుడల్లా ఈ చర్చను ఇతర అంశాల వైపులకు మళ్లిస్తున్నారన్నారు. దేశంలో విద్య, ఉద్యోగం, నిరుద్యోగం, కార్మిక సమస్యలు ప్రజా సమస్యలపై మొగ్గు చూపాల్సిన ప్రభుత్వం, కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట రాజకీయం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు.

ఒకపక్క పెరిగిపోతున్న నిరుద్యోగంతో పాటు, ధరలు పెరుగుదల కూడా ప్రజలపై మోయలేని భారంగా మారాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ ఆదాయాలు పెరగడం లేదనన్నారు. నిత్యావసర వస్తువులు, వంటగ్యాస్, రవాణా, విద్యుత్తు, వైద్యం, విద్యా ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ ఈశ్వరరావు, ఎస్ కె జాన్ బీ, నక్క నాగమణి, గాజుబోయిన కృష్ణవేణి, మెరుగు వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు.