ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ నాయకుడు ఆఫ్రిద్‌ను పరామర్శించిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ప్రమాదంలో ఓ కుటుంబాన్ని ఆందోళనలోకి నెట్టింది. ఆపద వేళ ఓనాయకుడి పలకరింపు ఆకుటుంబానికి కొంత ధైర్యాన్నిచ్చింది.ఆదివారం నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్‌పేట్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని వెల్నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యూత్ నాయకుడు ఆఫ్రిద్‌ను ఎల్లారెడ్డి సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి ఆఫ్రిద్‌ను స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆఫ్రిద్ కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దు ఆఫ్రిద్ త్వరగా కోలుకుంటాడు అంటూ కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను అండగా ఉంటానని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని పలకరించడం, బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వడం ద్వారా వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి తన మానవీయతను చాటుకున్నారు. ఆఫ్రిద్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.






