ఆలేరు నూతన ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్‌కు ఘన సన్మానం
10-08-2026 08:41 PM
ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ నూతన ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన ఉదయ్ కిరణ్‌ను కొల్లూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్‌కు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు ఉపసర్పంచ్ గాజుల దశరథ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్యాదపాక మల్లేష్, గాజుల వెంకటేష్, గ్యాదపాక సురేష్, యూత్ అధ్యక్షుడు నర్సింగరావు, ఉపాధ్యక్షుడు కండ్రాజు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.






