18 July, 2026 | 12:38 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ఆ రోజే జైలర్ 2 ప్రోమో

29-11-2024 12:00 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం విజయవంతమైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మేకర్స్ సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జైలర్ సీక్వెల్‌పై అదిరిపోయే అప్డేట్ వచ్చింది. జైలర్ రెండో భాగం షూటింగ్‌కు అన్నీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘జైలర్ 2’ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. తాజాగా చిత్ర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం..

‘జైలర్ 2’ సినిమాకు సంబంధించి ప్రోమో షూట్‌ను డిసెంబర్ 5న చెయ్యనున్నారు. అంతేకాదు రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ‘జైలర్ 2’కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేస్తారట. డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభిస్తారని తెలిసింది. ఈ సినిమాతోపాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న ‘కూలీ’కి సంబంధించిన కూడా ఓ సరికొత్త పోస్టర్‌ను ఆ చిత్రబృందం రిలీజ్ చేయనున్నట్టు భోగట్టా. ప్రస్తుతం రజనీ.. ఈ సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. ఈ మూవీ 2025లో విడుదల కానుంది.