18 July, 2026 | 12:57 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ముఖం కనిపించదు.. డైలాగ్ ఉండదు

29-11-2024 12:00 AM

ప్రస్తుత తరుణంలో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. జిమ్మిక్కులు చేయా లి. క్రియేటివిటీకి పదును పెట్టాలి. అలా పదును పెట్టి చేసిన చిత్రమే ‘మెటా ది డాజిలింగ్ గర్ల్’. ప్రసంద్ మాముల్ దర్శకత్వంలో రూపొందింది. ఇది కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన బెస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ చిత్రంగా అవార్డును గెలుచుకుని భారత్‌కు గర్వకారణం గా నిలిచింది. ఈ చిత్రాన్ని తిలక్ కొఠారి నిర్మించారు. వచ్చే ఏడాదికి ఆస్కార్‌కు పంపేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఒక అమ్మాయితో కథను మొత్తాన్ని నడిపించారు. ఆమె ముఖం మనకు కనిపించదు. కనీసం ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఏ భాషా చిత్రమో కూడా మనకు తెలియదు. ఈ చిత్రాన్ని డైలాగ్స్ లేని చిత్రంగా చెప్పవచ్చు. కథేంటంటే.. ఒక అమ్మాయి.. ఒంటరిగా ఓ నిర్మానుష్య ప్రాంతంలో చిక్కుకుపోతుంది. అక్కడ అడుగు వేస్తే మరణ భయం వెంటాడుతుంటుంది. జీవన్మరణాల మధ్య ఆ అమ్మాయి ఎలా సర్వైవ్ అయ్యిందనేదే కథ.