3 June, 2026 | 1:26 PM

జైనూర్ ASI ముండే ఉద్దవ్ బదిలీ

03-06-2026 12:43 PM

జైనూర్, జూన్ 1 (విజయక్రాంతి): జైనూర్ పోలీస్ స్టేషన్‌లో ASIగా విధులు నిర్వహిస్తున్న ముండే ఉద్దవ్‌ను తిర్యాణి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జైనూర్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది, స్థానికులు ఆయనను శాలువా కప్పి సన్మానించారు. జైనూర్‌లో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంలో కృషి చేశారని సిబ్బంది కొనియాడారు. తిర్యాణిలోనూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.