సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ కె హరిత
ప్రభుత్వ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను బుధవారం జిల్లా కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నీటి పారుదల కార్యనిర్వాహక ఇంజనీరు కార్యాలయం, పంచాయతీ రాజ్ భవనాల శాఖ సబ్ డివిజన్ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.సిబ్బంది సమయపాలనను పాటించాలన్నారు.
అనంతరం నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం పరిశీలించి మాట్లాడుతూ చెరువులు, కాలువల మరమ్మత్తులను త్వరితగతిన చేయాలని, ఎలాంటి ఆటంకం కలగకుండా సాగునీటిని అందించాలని కోరారు. కాలువలలో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు వచ్చేలా చూడాలని, కాలువల తూముల మరమ్మత్తులు పూర్తి చేయాలన్నారు. కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు .






