16 July, 2026 | 2:30 PM

Breaking News

జగ్గారం లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •   సీతారామ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేకాఫ్ పాయింట్ ను పరిశీలించిన మంత్రులు   •   హిందూ విద్యార్థిని కల్మాను చదవమనడం బాధకరం   •   హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: బండి సంజయ్   •   అమెరికా ఫెడ్ రిజర్వ్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక బాధ్యతలు   •   అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల గుడుంబా పట్టివేత   •   సోయా పంట తెగులు రైతన్న దిగులు   •   గోల్కొండలో ఘనంగా ప్రారంభమైన ఆషాఢమాస బోనాలు   •   ఉప్పుంతలలో వీధికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు   •   నాణ్యతలో రాజీ వద్దు.. పాఠశాల నిర్మాణాలు వేగవంతం చేయాలి   •  

జైశ్వాల్ రెండో హాఫ్ సెంచరీ

04-11-2025 12:00 AM

-డబుల్ సెంచరీతో మెరిసిన దీపక్ హుడా

-రంజీ ట్రోఫీ రౌండప్

జైపూర్ , నవంబర్ 3 : సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో జైస్వాల్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 67 రన్స్ చేసిన ఈ యువ ఓపెనర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌దే పైచేయిగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 254 పరుగులకు ఆలౌటవగా.. రాజస్థాన్ 617/6 భారీస్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. దీపక్ హుడా(248) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు.

కార్తీక్ శర్మ (139) సెంచరీ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో రాజస్థాన్ 363 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. మూడోరోజు ఆటముగిసే సమయా నికి ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 89/0 స్కోర్ చేసింది. జైస్వాల్ 56, ముషీర్‌ఖాన్ 32 పరుగులు చేశారు. మరో మ్యాచ్‌లో త్రిపురకు ఆడుతున్న ఆంధ్రా మాజీ ప్లేయర్ హనుమ విహారి సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మూడోరోజు ఒక్క వికెట్ కూడా తీయలేదు.

హైదరాబాద్ టార్గెట్ 344

ఆకాశ్ వశిష్ట్ సెంచరీతో చెలరేగడంతో హిమాచల్‌ప్రదేశ్ 344 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్ ముందు ఉంచింది. ఓవర్‌నైట్ స్కోర్ 274/8 స్కోర్‌తో మూడోరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ మరో 4 పరుగులు జోడించి మిగిలిన 2 వికెట్లు కో ల్పోయింది. సీవీ మిలింద్ (98;15 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో హిమాచ ల్ ప్రదేశ్ 303 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ వశిష్ట్ 101, ఏకాంత్ సేన్ 68 పరుగులో రా ణించగా మిలింద్ 3/67, పున్న య్య 2/52 ఆకట్టుకున్నారు. 344 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ మూడోరోజు ఆటముగిసేసరికి 8/0 రన్స్ చేసింది.