10 April, 2026 | 7:12 AM

ఇది ఆరంభమే

04-11-2025 12:00 AM

-ఇకపైనే అసలైన సవాల్ 

-మహిళల క్రికెట్‌ను సుధీర్ఘకాలం ఏలాల్సిందే

ముంబై, నవంబర్ 3 :వన్డే ప్రపంచకప్... పురుషుల క్రికెట్ అయి నా, మహిళల క్రికెట్ అయినా ఈ ట్రోఫీ గెలిస్తే చాలు ప్రపంచ క్రికెట్‌లో ఆ జట్టు ఆధిపత్యం మొదలైనట్టే.. కానీ ఆ ఆధిపత్యాన్ని సుధీర్ఘకాలం కొనసాగించగలిగితేనే గుర్తింపు...ప్రస్తుతం భారత మహి ళల జట్టుకు ఇలాంటి సవాలే ఇప్పుడు ఎదురుచూస్తోంది.

తొలిసారి ప్రపంచకప్ గెలిచి చిరకాల స్వప్నా న్ని నెరవేర్చుకున్న భారత వుమెన్స్ టీమ్ ఇకపైనే కొత్త ఛాలెంజ్‌లు ఎదుర్కోబోతోంది. పురుషుల క్రికెట్‌లో గతంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, భారత్ ఆధిపత్యం కనబరిచినట్టుగానే ఇప్పుడు మహిళ ల క్రికెట్‌లోనూ మన జట్టు కొన్నేళ్ల పాటు రూల్ చేయాల్సిం దే. వరల్డ్ కప్ ఒకసారి గెలవడంతోనే అయిపోదు. మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఒకటి కాదు రెండు కాదు ఏకం గా ఏడు సార్లు ప్ర పంచ చాంపియన్లుగా నిలిచింది.

భారత్,  కివీస్ ఒక్కోసారి కప్ గెలిచాయి. తొలిసారి ప్రపంచకప్ ను ముద్దాడిన మన మహిళల జట్టు అసలు సిసలు సవాళ్లతో కూడిన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలువుతుంది. ఇకపై భారత మ హిళల జట్టు ఏ టోర్నీలో ఆడినా భారీ అంచనాలే ఉంటాయి. కేవలం భారత అభిమానులే కాదు ప్రత్యర్థి జట్లు, వారి అభిమా నులు సైతం ఆసక్తిగా గమనిస్తుంటారు. ప్రపంచకప్ విజయం గాలివాటం కాదని అందరికీ తెలు సు.. కానీ రానున్న రోజుల్లో ప్రతీ సిరీస్‌లోనూ, ప్రతీ టోర్నీలోనూ భారత్ ఆటతీరు ను ఆ వరల్డ్ కప్ విజయంతోనే పోల్చి చూ స్తారు.

అందుకే ఆ అంచనాలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగినప్పుడే ఆస్ట్రేలి యా తరహాలో సుదీర్ఘకాలం పాటు ఆధిపత్యం కొనసాగించగలం. అలనాటి దిగ్గజా లు డయానా ఎడుల్జీ, అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వంటి వారు రిటైరయినప్పుడు కొత్త తరం వస్తూనే ఉంది. వారి స్థానాలను భర్తీ చేసే క్ర మంలో ఎంతోమంది వెలుగులోకి వస్తూనే ఉన్నారు. మిథాలీ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ భారత క్రికెట్‌ను నడిపిస్తోంది.

స్మృతి మం ధాన ఇప్పుడు టార్చ్ బేరర్‌గా, ఆ తర్వాత షెఫాలీ వర్మ, జెమీమా, దీప్తి శర్మ, రిఛా ఘోష్ లాంటి ప్లేయర్స్ అదరగొడుతున్నా రు. శ్రీచరణి, అరుంధతి రెడ్డి లాంటి తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు కూడా సత్తా చాటుతూ భవిష్యత్ మనదేనంటూ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. బీసీసీఐ ఎప్పుడైతే పురుషుల క్రికెట్ జట్టుతో సమానంగా అవకాశాలు, సౌకర్యాలు కల్పించిందో అప్పటి నుంచే భారత మహిళల క్రికె ట్‌లో సమూల మార్పులు కూడా మొదలయ్యాయి.

ముఖ్యంగా డబ్ల్యూపీఎల్ వచ్చిన తర్వాత ఎంతో మంది యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. బీసీసీఐ నమ్మకాన్ని నిలబెడుతూ వరల్డ్‌కప్ గెలిచిన మన అమ్మాయి లు ఇకపై జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ ఇదే జైత్రయాత్ర కొనసాగించాలనేదే ప్రతీ ఒక్కరి ఆకాంక్ష. ప్రపంచకప్ గెలుపు తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. మన రిజర్వ్ బెంచ్ కూ డా బలపడుతున్న వేళ సుధీర్ఘకాలం పాటు మహిళల క్రికెట్‌లోనూ మన ఆధిపత్యం కొనసాగేలా పకడ్బందీగా ముందుకెళ్లాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.