జపాన్ విద్యా విధానం అద్భుతం

15-09-2026 | 11:36pm

చదువుతోపాటు క్రమశిక్షణ,నైతిక విలువలు

తాడ్వాయి,(విజయక్రాంతి): జపాన్ విద్యా విధానం(Japanese education system) అద్భుతం.. భేష్ గా ఉందని ఉపాధ్యాయురాలు గూడూరు ఇందిరా, ఉపాధ్యాయుడు  ప్రవీణ్ కుమార్ లు తెలిపారు. జపాన్ పర్యటనను ముగించుకొని వచ్చిన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన గూడూరు ఇందిరా, కామారెడ్డి చెందిన ప్రవీణ్ కుమార్ మంగళవారం మాట్లాడారు. ఇందిరా కొండాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రవీణ్ కుమార్ చిన్న మల్లారెడ్డి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జపాన్ విద్యా విధానం చాలా బాగుందని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు బాధ్యతలకు పెద్దపీట ఇస్తున్నారని వివరించారు.జపాన్ పాఠశాలలను తాము  ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు.జపాన్ లో విద్యా విధానం సర్వతోముఖాభివృద్ధి ని లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం లో భాగంగా సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు ఉపాధ్యాయులు జపాన్ లో పర్యటించారు.

వీరు అక్కడి పాఠశాలలు, తరగతి గదులు, బోధన పద్ధతులు, విద్యార్థుల అభ్యాసన తదితర విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.అక్కడి పాఠశాల విద్యా విధానం నాలుగు దశలలో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎలిమెంటరీ స్థాయిలోనే విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రత, సామాజిక బాధ్యత సహకారం, నైతిక విలువలకు పునాది వేస్తున్నారని వివరించారు. పాఠశాల పరిశుభ్రతతో పాటు విద్యార్థుల భాగస్వామ్యం అద్భుతంగా ఉందని తెలిపారు. అక్కడ వారు మాతృభాషకు ప్రత్యేక గుర్తింపునిస్తున్నారన్నారు. జపాన్ జైస్ ఈడి అకావో తకాశి, శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ల నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారు.తాము అక్కడి విద్యా విధానం పట్ల ఆకర్షితులమయ్యామని వివరించారు.

మరిన్ని వార్తలు