10 May, 2026 | 2:14 AM

పదిలో మెరిసిన జవహర్ నగర్ పేదింటి ఆణిముత్యాలు

29-04-2026 09:14 PM

అద్భుత ఫలితాలతో... జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు

జవహర్ నగర్,(విజయక్రాంతి): పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పేదింటి ఆణిముత్యాలు మెరిసారు. ఈ మేరకు బుధవారం వెలువడిన ఫలితాల్లో జవహర్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో 159 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 124 మంది ఉత్తీర్ణత సాధించగా 78% నమోదవ్వగా సంకీర్త (548) మనీ సాత్విక( 539) సంఘం సాయిచరణ్ (539) ఆరాధన (537) లాస్య (534) సంజయ్ (534) మార్కులతో రాణించారు.

జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 134 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 115 మంది ఉత్తీర్ణత సాధించారు. 86% నమోద మహేష్ (542) భాను ప్రసాద్( 529)  మార్కులతో రాణించారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినందుకు బాలాజీ నగర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నరసింహ, జవహర్ నగర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆజా మోహినిద్దీన్ అభినందనలు తెలిపారు.