జవహర్ ‘యార్డు’ను నలుమూలలకు తరలించాలి
ముషీరాబాద్, సెస్టెంబర్ 29 (విజయక్రాంతి): దమ్మాయిగూడలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డును నగర నలు మూలలకు తరలించాలని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సన్నాహక కమిటీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నగరంలోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఆదివారం డం పింగ్ యార్డు బాధితులు పెద్ద ఎత్తున నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్లు గోగుల రామకృష్ణ, కేతుపల్లి పద్మాచారి, మారెం సమ్మిరెడ్డి, సంజీవరెడ్డి, సందీప్ మాట్లాడు తూ..
సీఎం రేవంత్‌రెడ్డి యార్డు తరలింపుపై సరైన నిర్ణయం తీసుకో కపోతే చెత్తను తీసుకొచ్చే లారీలను ఎక్కడికక్కడే అడ్డుకుంటామని హెచ్చరించారు. డంపింగ్ యార్డును మూసివేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాడు ఎంపీగా తమకు యార్డును తరలిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడాయన సీఎం అయినప్ప టికీ తమ సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.






