14-11-2025 12:00:00 AM
మనీలాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ
న్యూఢిల్లీ, నవంబర్ 13: 12వందల కోట్ల మనీలాండరింగ్ కేసులో జేపీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ మనోజ్‌గౌర్‌ను ఈ డీ అధికారులు గురువారం అరెస్ట్ చే శారు. గృహ కొనుగోలుదారుల నుంచి సేకరించిన నిధులను దారి మళ్లించడంలో మ నోజ్‌గౌర్ ప్ర మేయం ఉందని దర్యాప్తు అధికారులు ఆరోపించిన తర్వాత, మనీలాండరి ంగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసు జేపీ గ్రూప్ అనుబంధ సం స్థలైన జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ మరియు జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) లకు సంబంధించిన పెద్ద ఎత్తున ఆర్థిక అవకత వకలకు సంబంధించినదని ఆరోపించారు. గృహనిర్మాణ ప్రాజెక్టుల నుంచి అనుమానిత నిధుల మళ్లింపుపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. కొనుగోలుదారుల నుంచి నిరసనలు వ్యక్తమవడంతో 2017లో దాఖలైన కేసు ఆధారంగా మనీలాండరింగ్ దర్యాప్తు జరిగింది. జేపీ గ్రూప్‌పై నేరపూరిత కుట్ర, ప్రలోభాలకు పాల్పడటం వంటి అభియోగాలున్నాయి.