14-11-2025 12:00:00 AM
సీఎంకు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహా త్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేద ని ఫోరమ్ ఫర్ గుడ్ గవ ర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి తెలుపు తూ గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
ఈ పథకంపై సుమా రు 5000 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారని, దీనికిగానూ సుమారు రూ.1250 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ పథకం ఉద్దేశం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడమే అయినప్పటికీ, ఎంపిక ప్రక్రియ లో ఆర్థికంగా బలమైన కుటుంబాలకు చెందినవారు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు లబ్ధి పొందుతున్నారని పే ర్కొన్నారు. జాతీయ విద్యా విధా నం ప్రకారం ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేస్తూ స్థానిక విలువలకు అనుగుణంగా దేశంలోనే తీర్చిదిద్దాలని సూచనలున్నాయని తెలిపారు.
హైద రాబాద్‌ను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం అన్నారని, మరీ మన విద్యార్థులను విదేశాలకు పంపా ల్సిన అవసరం ఏముందన్నారు. దేశంలోనే అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందుబాటులో ఉండి, తక్కువ ఖర్చుతో లభ్యమవుతున్న నేపథ్యంలో విద్యార్థులను ఇక్కడే చదివేలా ప్రోత్సహించాలన్నారు. 2013లో ప్రవేశపెట్టిన విదేశీ విద్యా నిధి పథకం ప్రస్థు త పరిస్థితులలో పనికి రావడం లేదని, ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని పునఃపరిశీలించాలన్నారు.