17 April, 2026 | 8:58 AM

అల్లాదుర్గంలో జినపాద సింహాసనం

10-06-2025 12:00 AM
  1. అరుదైన శాసన సహిత, జినపాద సింహాసనంతో జైనబసది
  2. గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం

హైదరాబాద్, జూన్ 9: మెదక్ జిల్లా అల్లాదుర్గంలో అరుదైన జినపాద సింహాసనం, శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, మఠం వినోద్ కుమార్, సిరిపురం వినోద్‌కుమార్ గుర్తించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాదుర్గంలోని బేతాళుని గుడి మంటపస్తంభాలమీద ఉన్న రెండు శాసనాలలో బద్దిగ జినాలయం, కీర్తివిలాస శాంతిజి నాలయం అనే రెండు జైనబసదులు ప్రస్తావించబడ్డాయి.

ఎల్లమ్మగుడి, హనుమాండ్ల గుడి, బేతాళునిగుడి మూడుచోట్ల కూడా జైనబసదుల ఆనవాళ్లు లభిస్తున్నాయి. హ నుమాన్ గుడి ద్వారానికి రెండువైపుల రుషభనాథ్, మహావీరుల మూడు ధ్యానాసన భంగిమ శిల్పాలున్నాయి. వాటితోపాటు ఆదిత్యుడు, ఏనుగు రెయిలింగ్, త్రిపురసంహారమూర్తి శిల్పశకలం వున్నాయి. దేవాల య ద్వారబంధంలో ఉత్తరాశివరకు కత్తిరించి పెట్టినట్లుంది. దానిమీద పద్మపత్రాలు, లలాటబింబంగా జినుని శిల్పం, ఆ పైన గజలక్ష్మి, ఏనుగులపైన రెండువానరాలు, తోరణంపై అంతస్తులో విష్ణువు, ఆదిత్యుడు పరిచారకులతో కనిపిస్తున్నారు.

పురావస్తుశాఖ అల్లా దుర్గం మోనోగ్రాఫ్‌లో ఈ గజలక్ష్మిఫలకం తవ్వకాల్లో దొరికినట్లు రాసి ఉం ది. ఆ గజలక్ష్మిని ఈ గుడిద్వారంపై అమర్చిన ట్లున్నారు. గజలక్ష్మి కింద జిను ని శిల్పం బైరాంపల్లి అంగడివీరన్నగుడి ద్వారబంధాన్ని పోలివుంది. గుడిలోపల మంటపంలో నందికందిగుడిలోని చిత్రకంఠస్తంభాలను పోలిన రాష్ట్రకూటశైలి స్తంభా లు వాటిపై శిల్పాలతో కనిపిస్తున్నాయి. 

గుడిలో హనుమంతుని విగ్రహానికి కుడివైపు గూటిలో పాలరాతి సింహాసనం, మీద పాదాలు, వెనక గుండ్రని రాతిపలకమీద నాగరిలిపిలో మూడుపంక్తుల శాసనం వున్నాయి. సింహాసనం ముందుభాగాన అభిషేక జలాలు పోవడానికి సింహముఖప్రణాళి వుంది.

ఇది జినుని పాదాల సింహా సనం. ఇంతకు మునుపు మరెక్కడా కనిపించని కొత్తశిల్పం. హనుమాన్ దేవాలయం ఒకప్పటి జినాలయమే. ఈ గుడి బద్దెగ లేదా కీర్తివిలాస శాంతిజినాలయాలలో ఒకటై వుంటుందని వారు పేర్కొన్నారు.