13 July, 2026 | 5:20 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

జాబ్ మేళాలో ఎంఎస్ఎన్ కంపెనీకి 50 మంది ఎంపిక

06-04-2026 05:09 PM

ఇంటర్ విద్యార్థులకు జాబ్ మేళా

విద్యార్థులు స్కిల్స్ ను పెంచుకోవాలి

ఇంటర్ నోడల్ అధికారి సలాం

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఎస్ఎన్ ఫార్మా, సి ఈగ టెక్నాలజీస్ హైదరాబాద్ కంపెనీలు సోమవారం కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జాబు మేళా నిర్వహించారు.జాబ్ మేళాకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించారు. 50 మంది అభ్యర్థులు ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీకి ఎంపికయ్యారు. మరో నలుగురు ఐటిఐ అభ్యర్థులు ఎంపికయ్యారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జయ కుమారి , ఐ టి  అసోసియేట్ జిల్లా కలెక్టరేట్ శ్రీ కాంత్, ఎంఎస్ఎన్ ఫార్మా హెచ్ ఆర్  సీతారాం, శిరీష,  రవి, కళాశాల సిబ్బంది సంతోష్ రెడ్డి, సాయినాథ్, ప్రవీణ, యోగిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం  ఎంపిక చేయబడిన అభ్యర్థులకు ఉద్యోగ శిక్షణతో పాటు టి ఐ ఎస్ ఎస్ వారి సౌజన్యంతో డిగ్రీ విద్యను అందిస్తామని తెలిపారు. ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు.

శ్రీకాంత్  ఎంపీసీ చదివి EAPCET లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉచిత ఇంజనీరింగ్ విద్యా హాస్టల్ వసతి, కల్పిస్తామని, భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల కామారెడ్డి లో నిర్వహిస్తామని తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తు కార్యక్రమాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసి అనేకమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తమ కళాశాల ముందంజలో ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ జయ కుమారీ తెలిపారు. విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ పైన శిక్షణ ఇస్తామని డిజిటల్ బోధన చేస్తామని  జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సలాం తెలిపారు.అభ్యర్థులు మంచి నైపుణ్యాలను నేర్చుకోవాలని ఉద్యోగాలు సంపాదించాలని వారికి స్ఫూర్తి నింపారు.