6 April, 2026 | 6:57 PM

పశువులకు గాలికుంటు టీకాలు

06-04-2026 05:13 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యులు డాక్టర్ గంగ ప్రసాద్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి పశువులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే వైరల్ వ్యాధి అని, దీనిని నివారించడానికి టీకాలు వేయించడం ఒక్కటే సమర్థవంతమైన మార్గమని తెలిపారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందస్తుగా టీకాలు వేయించడం చాలా తక్కువ ఖర్చుతో పాటు పశువుల ప్రాణాలను కాపాడుతుందని మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు. రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.