11 March, 2026 | 6:36 AM

13న పెద్దపల్లిలో జాబ్‌మేళా

11-03-2026 12:00 AM

జిల్లా ఉపాధి కల్పనాధికారి వై.తిరుపతిరావు

పెద్దపల్లి , మార్చి 10(విజయ క్రాంతి) జిల్లాలోని నిరుద్యోగ యువతీ ,యువకులకు కరీంనగర్ లోని డాక్టర్. రెడ్డీస్ ఫౌండేషన్ లో ఉద్యోగ అవకాశాలకై ఉచిత భోజన వసతితో కూడిన  3నెలల శిక్షణ, వెంటనే ఉపాధి కల్పించుటకు మార్చి 10 శుక్రవారం రోజున  జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి  వై.తిరుపతిరావు మం గళవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు కరీంనగర్ లోని  డాక్టర్. రెడ్డీస్ ఫౌండేషన్ లో  ఉద్యోగ అవకాశాలకై ఉచిత భోజన వసతితో కుడినా 3 నెలల శిక్షణతో ఉపాధి అవకాశాలూ,

సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ ,ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్ కంప్యూటర్, ఇంటర్వూ, స్కిల్ శిక్షణ కల్పిస్తున్నామని,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంస్థలో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, డిప్లమా, బిటెక్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఆపై విద్యార్హత సాధించిన వారు అర్హులని, వయస్సు 18 సంవత్సరాలు నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలని సూచించారు.ఆసక్తి ఉన్నవారు  మార్చి 13న  ఉదయం 11 గంటల కు సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో రూమ్  నెంబర్ 233 నూతన కలెక్టర్ భవన సముదాయంలో, పెద్దకాల్వల పెద్దపల్లి మొదటి అంతస్థులో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు  8985336947, 8121262441 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి  ఆ ప్రకటనలో  పేర్కొన్నారు.