1 July, 2026 | 10:21 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

జోబైడెన్‌కు కొవిడ్ పాజిటివ్

19-07-2024 12:05 AM

ఐసోలేషన్‌లో అమెరికా ప్రెసిడెంట్  

ట్రంప్‌ను ఓడించలేవు, తప్పుకోవాలన్న నాన్సీ పెలోసీ 

న్యూఢిల్లీ, జూలై 18 : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కొవిడ్ సోకినట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా లాస్‌వేగాస్ వెళ్లిన ఆయనకు కొవిడ్ పరీక్షలు పాజిటివ్‌గా తేలినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియర్ తెలిపారు. బైడెన్ ప్రస్తుతం డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. బైడెన్ కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారని, అక్కడి నుంచి విధులు నిర్వహిస్తారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా లాస్ వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో బైడెన్ పాల్గొన్నారు. ప్రసంగానికి ముందు కొవిడ్ టెస్టు చేయడంతో అందులో పాజిటివ్‌గా వచ్చింది. 

ట్రంప్‌ను ఓడించలేవు.. తప్పుకో

వయోభారం, మతిమరుపు, అనారోగ్య సమస్యలు, డిబేట్లలో తడబడటం వంటి కారణాలతో అధ్యక్షబరిలో నుంచి తప్పుకోవాలని సొంతపార్టీ డెమోక్రటిక్ నేతల నుంచి బైడెన్‌పై ఒత్తిడి పెరిగింది. ట్రంప్‌ను ఓడించే శక్తి లేదని, అభ్యర్థిత్వం నుంచి వైదొలగాలని మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా తన అభిప్రాయం తెలియజేశారు.