15-11-2025 08:45:09 AM
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు
తుంగతుర్తి (విజయ క్రాంతి): నాణ్యమైన లో దుస్తులకు కేరాఫ్ అడ్రస్ గా జాకీ బ్రాండ్ ఉందని జాకి బ్రాండ్ అండర్వేర్ ఇన్నర్ వేర్ షోరూం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం హర్షనీయమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ నుంచి నిర్మల హాస్పిటల్ రోడ్డుకు వెళ్లే మార్గంలో రుద్ర ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జాకీ షోరూంను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
జాకీ కంపెనీ లోదుస్తులు ఎంతో నాణ్యమైనవిగా పేరు పొందాయన్నారు. జాకీ బ్రాండ్ స్త్రీ పురుషుల అండర్వేర్ ఇన్నర్ వేర్లను అందరికీ అందుబాటులో ఉండేలా సూర్యాపేటలో నూతనంగా షోరూం ప్రారంభించడం అభినందనీయమన్నారు. సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాకీ బ్రాండ్ అండర్వేర్ ఇన్నర్ వేర్లకు షో రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు హేమంత్ రెడ్డి శ్రావణి, బైరెడ్డి వెంకట్ రెడ్డి, పందిరి వీరారెడ్డి, వీరాచారి, అబిద్ తదితరులు పాల్గొన్నారు.