15-11-2025 02:08:37 AM
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : ప్రజాపాలన రెండో వార్షికోత్స వా న్ని డిసెంబర్ 8న వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించబోతున్నామని తెలిపారు.
శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వ హించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసకుంటున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ భవిష్యత్‌కు రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. పాలసీ ఆధారంగానే భవిష్యత్ నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నా రు. పాలసీ డాక్యుమెంట్‌తో పెట్టుబడిదారులకు ఒక స్పష్టత వస్తుందని చెప్పారు.
శాఖ లవారీగా పాలసీలకు సంబంధించి సమ్మిట్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల ని చెప్పారు. ఈ నెలాఖరులోగా శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు వి విధ దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో భద్రత విషయంలో తగిన జా గ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.