15-11-2025 08:48:17 AM
భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం
కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కిడ్స్ విత్ కాకి.. పాల్గొన్న ఎల్లారెడ్డి జీవదాన్ పాఠశాల విద్యార్థులు
నేరుగా జిల్లా ఎస్పీ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి
ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ కుమార్
ఎల్లారెడ్డి, నవంబర్15(విజయ క్రాంతి): కిడ్స్ విత్ కాకి, కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లాలోని పలు పాఠశాలల నుండి పలువురు విద్యార్థులతో పోలీసులు రోజువారి విధులు నిర్వహిస్తున్న పలు రకాల విధులను డ్రంక్ అండ్ డ్రైవ్, 100 డయల్, పలు రకమైన కేసుల పట్ల నేరుగా విద్యార్థులతో ముఖాముఖి వివరించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన జీవధాన్ హై స్కూల్ నుండి పదిమంది విద్యార్థులను ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కిడ్స్ విత్ కాకి కార్యక్రమంలో పాల్గొనపరిచారు. కిడ్స్ విత్ కాకి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, రోజువారీగా పోలీసులు నిర్వహిస్తున్న విధులను విద్యార్థులకు వివరించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం నిర్వహిస్తామన్నారు. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారని పిల్లలతో తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఎల్లారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులకు రోజువారీగ వస్తున్న ఫిర్యాదుల పట్ల, రోజూ నిర్వహిస్తున్న విధుల పట్ల కనువింపు చేశారు. 100 డయల్ కాల్ రిసీవ్ చేసుకోవడం దాని పట్ల పోలీసులు నిర్వహించే విధులను తెలియపరచి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ నేరుగా విద్యార్థులతో చేపించి పోలీసుల విధులను కళ్ళకు కట్టినట్టు కనువింపు చేశారు. విద్యార్థులు పోలీసుల విధుల పట్ల హర్షం వ్యక్తం, చేశారు.ఈ కార్యక్రమంలో,ఎస్సై 2 సుబ్రమణ్యం చారి,పోలీస్ సిబ్బంది అమర్ అనిల్ గౌడ్, శ్రావణ్ కుమార్,జీవధాన్ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.