1 March, 2026 | 10:22 PM

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన జోగు రామన్న

21-09-2024 12:31 AM

ఆదిలాబాద్ జిల్లాలో తాజా పరిస్థితులపై చర్చ

ఆదిలాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న శుక్రవారం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు జోగు రామన్న తెలిపారు. ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమిపై కేసీఆర్ చర్చిస్తూ.. నైతికంగా జోగు రామన్నది ఓటమి కాదని, రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటారని పేర్కొన్నారని రామన్న తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని, తిరిగి అదిలాబాదులో జోగు రామన్న విజయం ఖాయం అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో ఉంటూ ఉద్యమం చేయాలని సూచించారన్నారు.