20-02-2026 12:00:00 AM
సిద్దిపేట రూరల్ ఫిబ్రవరి 19: నారాయణరావుపేట మండలం గోపులాపూర్ గ్రా మంలో ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కురటి రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వర్డ్ మెంబర్ కురటి రేణుకతో పాటు పర్స నర్స య్య, బత్తుల ఆంజనేయులు, కొమురయ్య, వెంకట్, రాకేష్, యాదయ్యతో పాటు పలువురు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
డీసీసీ ప్రధాన కార్యదర్శులు మీసం నాగరాజ్ యాదవ్, చింతల రాజ్వీర్ ముదిరాజ్, మండల అధ్యక్షుడు బర్మ రామచంద్రం పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇందిర మ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలతో ప్ర భుత్వం ప్రజల విశ్వాసం పొందుతోందన్నా రు.
అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ సీఎం అనుముల రే వంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రా బోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో కల్లూరి నర్సింలు, రెడ్డి మహేందర్ రెడ్డి, ఉడుత ప్రశాంత్, కు మార్, ఎం.డి. ఇబ్రహీం తదితర నాయకులు పాల్గొన్నారు.