20-02-2026 12:00:00 AM
నాగల్ గిద్ద, ఫిబ్రవరి 19: శాస్త్రీయ వ్యవసాయ సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం మండల కేంద్రంలోని కరస్ గుత్తి గిరిజన గురుకుల స్కూల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సాయిల్ హెల్త్ ప్రోగ్రాం నిర్వహించారు. మట్టి నమూనా సే కరించే విధానంపై క్షత్రస్థాయిలో అవగాహన కల్పించి మట్టిలో పోషకాలు, సమతుల్యత, పంటల దిగుబడిపై వివరించారు. సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల మార్పిడి ప ద్ధతులపై తెలియజేశారు. ఏవో ప్రవీణ్ చారి, ఏఈవో స్రవంతి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.