calender_icon.png 21 February, 2026 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి

20-02-2026 12:00:00 AM

కేసముద్రం, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): చత్రపతి శివాజీ స్పూర్తితో యువత ముందుకు సాగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో చత్రపతి శివాజీ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వల్లముల రాజేందర్ యాదవ్,నద్దునూరి ప్రశాంత్, లింగాల సందీప్, మట్టపల్లి హరీష్,పెండ్లి మహేందర్,గణేష్,గాడుదుల వీరన్న,కందుల నవీన్, బొల్లా హరీష్,రోహిత్, బూర రాజేష్,పప్పుల రాజ్ కుమార్, కట్టుకురి గణేష్, మదన ప్రశాంత్ పాల్గొన్నారు.

కాషాయం జెండాలతో బైక్ ర్యాలీ

వెంకటాపూర్, ఫిబ్రవరి19 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఛత్రపతి శి వాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకుని మెయిన్ రోడ్డు సర్కిల్ వద్ద ఛ త్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అభిమానులకు మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుగుణ మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో అపూర్వ వీరుడని, స్వరాజ్య స్థాపనకు అహర్నిశలు శ్రమించి హిందవ సామ్రాజ్యాన్ని స్థాపించారని, పరాక్రమం, ధైర్యం, ధర్మనిష్ఠ, ప్రజల పట్ల కట్టుబాటు వంటి లక్షణాలు ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినవని అన్నారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు అజయ్ మాట్లాడు తూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని, దేశభక్తి, సామాజిక సేవాభావం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో శివాజీ మహారాజ్ ఆలోచనలు ఎంతో ప్రాముఖ్యమున్నవని తెలిపారు. శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్వరలోనే పూర్తి చేయడమే తమ సంకల్పమని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అనంతరం యువకులు కాషాయం జెండాలతో వీధివీధిల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ సభ్యులు, యువకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

మరిపెడ , ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జ యంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని స్థానిక పాత ట్యాంక్ (ఆటో స్టాండ్)వద్ద చత్రపతి శివాజీ మహరాజ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన ప్రాణాలను అర్పించి ఎంతో మందికి స్ఫూర్తి దాయకం గా నిలిచి యుద్ధం లో శత్రువులను చీల్చి చెండాడి మట్టి కరిపించిన తీరును వివరించారు. ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనా న్ని,ధైర్య సాహసాలను, హిందుత్వ నిష్టను మనమంతా ఆదర్శంగా తీసుకొని భారతీయ విలువలను పెంపొందించు కోవాలన్నారు.

ఈ బైక్ ర్యాలీ లో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు దేవరశెట్టి గణేష్, అక్కినపల్లి భాస్కర్, భ య్యా మహేష్, దేవరశెట్టి ఉమేష్, ఉప్పల ర మేష్,దేవరశెట్టి శ్రీకాంత్, ముదిరెడ్డి నరేష్ రె డ్డి, సంతోష్ రెడ్డి, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, కొడిపిగంటి కర్ణాకర్, ఏదులాపురం రాజు, డాక్టర్ వేణు, నాగరాజు, గంధసిరి ఉమేష్, వంగవీటి కిరణ్, డోజర్ బిక్షం, కొరివి లింగన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శివాజీ జయంతి ఉత్సవాలు

ఏటూరునాగారం,ఫిబ్రవరి19(విజయక్రాంతి):ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏటూరునాగారంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. రేణుక అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తాడ్వాయి జూనియర్ కళాశాల ప్రిన్సి పాల్ శ్రీ అవిలయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్య అతిథి అవిలయ్య గారు మాట్లాడుతూ శివాజీ మహారా జు దేశభక్తి, పరిపాలనా దక్షత మరియు ధైర్యసాహసాలు నేటి యువతకు ఆదర్శమని తె లిపారు.

యువత దేశ నిర్మాణంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రిన్సి పాల్ డా. బి. రేణుక మాట్లాడుతూ శివాజీ మహారాజు నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్క రూ అలవర్చుకోవాలని సూచించారు.ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మరియు చరిత్ర విభా గాధిపతి వెంకటయ్య శివాజీ చరిత్రను వివరించారు. మహిళా సాధికారత సెల్ కన్వీనర్ కనీస్ ఫాతిమా మహిళల గౌరవ పరిరక్షణలో శివాజీ చేసిన కృషిని ప్రస్తావించారు.

అనంతరం క్విజ్ లో పాల్గొని విజేతలు అయినటువంటి విద్యార్థులకు బహుమతులు అం దజేసి ప్రశంసించారు.రాజకీయ శాస్త్ర విభాగాధిపతి కె. రమేష్, తెలుగు విభాగాధిపతి కె. సంపత్, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి పి. భా స్కర్, అధ్యాపకులు జీవవేణి, భారతి, రాజశేఖర్, శ్రీకాంత్, శ్రీధర్ పాల్గొన్నారు. విద్యా ర్థులు దేశభక్తి గీతాలను ఆలపించి వేడుకలను విజయవంతం చేశారు.