తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జూన్ 28(విజయక్రాంతి): గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కాలనీకి చెందిన పలువురు స్థానికులు ఆదివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)లో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్పీలో చేరిన వారు కుంచెం వెంకన్న, ఉడుతల ప్రవీణ్, ఉడుతల అం జయ్య, నరేందర్, రామకృష్ణ, రాంబాబు, ర మేష్, సరోజ ఉన్నారు.
ఈ సందర్భంగా మ ల్లన్న మాట్లాడుతూ టీఆర్పీ పార్టీ ఆశయా లు, సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హ క్కుల కోసం పార్టీ చేస్తున్న పోరాటాన్ని విశ్వసించి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్య లో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
రాబోయే రోజుల్లో మ రింత మంది పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరనున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి,క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారు రమేష్ యా దవ్, పార్టీ ఆఫీసు కో ఆర్డినేటర్ లింగం యా దవ్ తదితరులు పాల్గొన్నారు.






