4 August, 2026 | 1:56 AM

తెలంగాణ రక్షణ సేనలోకి చేరికలు

04-08-2026 12:00 AM

చేవెళ్ల ఆగస్టు 3 (విజయక్రాంతి): టీఆర్‌ఎస్ పార్టీలో చేరికల్ భారీగా జరుగుతున్నాయి. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం చేవేళ్ల మండల అధ్యక్షుడు మల్లేపల్లి శ్రీనివాస్ సోమవారం తెలంగాణ రక్షణ సేన టి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. చేవేళ్ల నియోజకవర్గం ఇంచార్జి బేగరి రాజు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.

అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ... భోజన రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యంగా ఏర్పడిన టిఆర్‌ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. బహుజన రాజ్యాధికారం తన భుజస్కందాలపై మోస్తూ... పార్టీని ముందుకు నడుపుతున్న కల్వకుంట్ల కవిత ధైర్యశాలి అన్నారు. పార్టీ నిబంధనల మేరకు నేతలు కార్యకర్తలతో కలిసి బహుజన రాజ్యాధికారం కోసం తన వంతు కృషి చేస్తానని మల్లెపల్లి అన్నారు.