4 August, 2026 | 1:48 AM

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

04-08-2026 12:00 AM

గణపురం,ఆగస్టు 3 (విజయ క్రాంతి): మండలంలోని గాంధీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాంధీనగర్ సర్పంచ్ డాక్టర్ ఇంజపెల్లి శ్రీనివాస్ తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించడం వల్ల శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.

తల్లిపాలు బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరమని, ప్రతి తల్లి ఈ విషయాన్ని గుర్తుంచుకుని చిన్నారులకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జ్యోతి, సునీత, సుజాత, ఆయాలు సుజాత, సరోజన, ఆశా కార్యకర్తలు, కారోబార్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.