4 August, 2026 | 1:45 AM

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి

04-08-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, ఆగస్టు 3 (విజయ క్రాంతి): ప్రజావాణి వినతుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ దరఖాస్తులను వచ్చే వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి ఆయన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో మొత్తం 81 దరఖాస్తులు రాగా, వాటిని తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు.జిల్లా స్థాయి ప్రజావాణికి సంబంధించి గత వారం వరకు ఉన్న 144 దరఖాస్తులు, అలాగే సీఎం ప్రజావాణి నుంచి వచ్చిన 47 దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

పెండింగ్లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు, కొత్తగా వచ్చిన వినతులను రాబోయే వారం రోజుల్లోగా వేగవంతంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఖరాఖండిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్‌ఓ వసంత కుమారి, ఆర్డిఓ హరికృష్ణ, శిక్షిణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.