భారత్–కెనడా సంయుక్త ప్రకటన: పశ్చిమాసియా యుద్ధంపై మోదీ ఆందోళన, కీలక ఒప్పందాలు
భారత్-కెనడా ప్రధానుల సంయుక్త ప్రకటన
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ వాతావరణం ఆందోళన కలిగిస్తోందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ లో చిక్కుకున్న భారతీయుల కోసం దేశాలతో సంప్రదింపులు చేస్తున్నామని ప్రధాని తెలిపారు. భారత దేశం ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
భారత్-కెనడా(India-Canada) దేశ ప్రధానులు సంయుక్త ప్రకటన చేశారు. విద్యుత్, టెక్నాలజీ రంగాల్లో సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరాలని కెనడా నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమిలో(Global Biofuel Alliance) చేరాలని కెనడా నిర్ణయించింది.
ఇండో-పసిఫిక్‌లో భారతదేశానికి కెనడా ఒక ముఖ్యమైన భాగస్వామి అని, హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్‌లో సంభాషణ భాగస్వామిగా మారడానికి దాని ఆసక్తిని స్వాగతిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ, నౌక పరిశ్రమల అంశంలో సహకరించుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయం తీసుకున్నారు. యురేనియం ఒప్పందంపై భారత్, కెనడా సంతకాలు చేశాయి.




