కమిటీ ఏర్పాటు పట్ల హర్షం
కేసముద్రం, మే 18 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్య మకారులను గుర్తించడానికి కె.కేశవరావ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినందుకు కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. కేసముద్రం పట్టణంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చాగంటి కిషన్ మాట్లాడుతూ కమిటీ వెంటనే విధివిధానాలు ప్రకటించాలని కోరారు.
కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గుగులోత్ దస్రూనాయక్, మండల ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, జేఏసీ పూర్వ కన్వీనర్ మోడెం రవీందర్ గౌడ్, విద్యార్థి, యువజన జేఏసీ పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్, కర్పూరపు మురళి, తోట సుధాకర్, జల్లె జయరాజ్, బాలు మోహన్, సోమారపు వెంకటయ్య, చుంచు సూరయ్య, కీర్తి సమ్మయ్య, మాందాటి ఆంజనేయులు, నానబాల దూడయ్య, చంద్రకళ పాల్గొన్నారు.






