జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి 1,600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్
ముంబై: భారతలో ప్రముఖ ప్రైవేట్ రం గ విద్యుత్ సంస్థల్లో ఒకటైనజేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్’ బుధవారం పశ్చిమ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అభివృద్ధి, నిర్వహణ కోసం ఆర్డర్ పొందింది. బెంగాల్ గ్లోబల్ సమ్మిట్(రాష్ట్ర వార్షిక వ్యాపార సదస్సు) ప్రారం భోత్సవానికి ముందు ఈ ప్రకటన వచ్చింది.
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ద్వారా అభివృద్ధి, నిర్వహణ జరిగే ఈ ప్లాంట్ గ్రీన్‌ఫీల్ 2x800 మెగావాట్ల సూపర్ అల్ట్రా సూపర్ క్రిటికల్ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పోటీ బిడ్డింగ్ ప్రక్రియలో ఈ ప్రాజెక్టును సాధించినట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తన ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లోతెలిపింది. దీంతో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీకి సంబంధించిన మొత్తం (లాక్-ఇన్)ఉత్పత్తి సామర్థ్యం 30 గిగావాట్లకు చేరుకోగా, అందులో థర్మల్ విద్యుత్ సామర్థ్యం 9 గిగావాట్ల వద్ద ఉంది.






