22 June, 2026 | 7:08 AM

ఓలానుంచి రెండు కొత్త మోటార్ సైకిళ్లు

06-02-2025 12:46 AM

చెన్నై: విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్  రోడ్‌స్టర్ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లనుతాజాగా లాంచ్ చేసింది. ఇటీవల థర్డ్ జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన స్కూటర్లను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ఎక్స్+ సేరిట విద్యుత్ మోటారు సైకిళ్లను విడుదల చేసింది.

వేర్వేరు బ్యాటరీ వేరియంట్లలో ఇవి లభ్యమవుతాయి. వీటి ధర రూ.74,999( ఎక్స్ షోరూమ్)నుంచి ప్రారంభమవుతాయి. బుధవారంనుంచి బుకింగ్స్ స్వీకరిస్తామని, వచ్చే నెలనుంచి  డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ తెలిపారు.