15 July, 2026 | 3:36 AM

సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జస్టిస్ చంద్రఘోష్

08-06-2024 01:09 PM

రామగిరి: పెద్దపల్లిజిల్లా రామగిరిమండలం సుందిళ్ళ గ్రామంలో స్వయంభు వెలసిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ పినాకి చంద్ర ఘోష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ కమిషన్ జస్టిస్ చంద్ర ఘోష్ పర్యటనలో భాగంగా సుందిళ్ల లక్ష్మీ నరసింహ స్వామిని చంద్ర ఘోష్ దంపతులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ పండితులు దంపతులను ఆశీర్వదించి, శాలువాతో సన్మానించి సత్కరించారు.