8 July, 2026 | 4:37 AM

హెచ్‌సీఏ ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ ఈశ్వరయ్య

15-05-2024 12:32 AM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ ఈశ్వరయ్య.. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎథిక్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. హెచ్‌సీఏ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానంతో జస్టిస్ ఈశ్వరయ్య ఏడాది పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జస్టిస్ ఈశ్వరయ్య ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్.. ఆయనకు స్వాగతం పలికారు.