8 July, 2026 | 5:46 AM

షాంటో సారథ్యంలో

15-05-2024 12:32 AM

కా: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టుకు నజ్ముల్ హుసేన్ షాంటో సారథ్యం వహించనున్నాడు. మెగాటోర్నీకి కౌంట్‌డౌన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌కు తస్కీన్ అహ్మద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. లిటన్ దాస్‌తో పాటు యువ సంచలనం తౌహిద్ హృదయ్, ఆల్‌రౌండర్ మహ్ముదుల్లాకు కూడా జట్టులో చోటు దక్కింది.