3 August, 2026 | 1:38 AM

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

03-08-2026 12:15 AM

గట్టు, ఆగస్టు 2 (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘం ప్రతినిధులు పరామర్శించారు. ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందగా, మహిళ తీవ్ర గాయాలతో మంచానికే పరిమితమైనట్లు తెలిపారు.

ప్రమాదానికి బాధ్యులైన వారు వెంటనే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి న్యాయం చేయాలని సంఘం డిమాండ్ చేసింది. అలాగే ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరామర్శించిన వారిలో మేడికొండ ఈశ్వర్ ఎల్లస్వామి, బిజ్వరంతిమ్మప్ప రాములు, ఉద్యొగసంఘం నాయకులు మాజి సింగల్ విండొ చైర్మన్ రాయపురం రాముడు , రాము ,వాల్మికి సంఘంనాయకులు తదితరులుఉన్నారు.