సమ్మక్క కుటుంబానికి న్యాయం చేయాలి
26-03-2026 01:16 AM
ఎస్సీ, ఎస్టీ కమిషన్ బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు
కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): జిల్లాలో జరిగి న ఆదివాసీ యువతి ఆత్రం సమ్మ క్క హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ బుధవారం హైదరాబాద్‌లో గోండ్వానా కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య, బాధితురాలి తల్లిదండ్రులు, సోదరితో కలిసి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు.
హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి న్యాయం చేయాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.గడ్డం లక్మణ్ డిమాండ్ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ చైర్మన్ బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, త్వరలో ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తామని తెలిపారు.




