30 July, 2026 | 9:11 PM

Breaking News

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు   •   మాల్తుమ్మెదలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంపై అవగాహన   •   భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •   అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి   •   ఘనంగా సోనుసూద్ జన్మదిన వేడుకలు: బలగం శ్రీధర్   •   టి జేఏసీ జిల్లా చైర్మన్‌కు రంగానాయక్ కుటుంబం అభినందనలు   •  

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: అటవీ శాఖ అధికారి ప్రియాంక

10-06-2026 06:31 PM

సిరికొండ,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి మొక్కలను నాటి సంరక్షించాలని అటవీ శాఖ అధికారి ప్రియాంక అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని రీమ్మ గ్రామపంచాయతీలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్ల పాత్ర కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని పెంచాలని పిలుపునిచ్చారు.