10 June, 2026 | 7:05 PM

శ్రీరాములపల్లిలో గ్రామసభ

10-06-2026 06:29 PM

- వర్షాకాలం పంటల సాగు, పరిశుభ్రత పై అవగాహన

కోహెడ: శ్రీరాములపల్లి సర్పంచ్ పోలు శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారి కృష్ణయ్య హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. వర్షాకాల సీజన్, పంటల సాగు, ఓటర్ నమోదు సవరణల పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వర్షాకాల సీజన్లో రోగాల భారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని.. వర్షపు నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీటిని మరిగించి లేదా శుద్ధిచేసి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.